BREAKING
*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*..... భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా...సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య టాలీవుడ్ నుంచి మరో కొత్త తరహా ఎంటర్‌టైనర్.. రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ రిలీజ్! టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా? ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ

తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్!

Select Suryaa Now
తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్!

 

అలా చేస్తే కఠిన చర్యలు.. తిరుమల బ్రహ్మోత్సవాలపై పోలీసుల వార్నింగ్!

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ వదంతులు నమ్మొద్దని పోలీసుల హెచ్చరిక

తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ 

అధికారిక ప్రకటనలనే అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి 

భద్రత కోసం 6,071 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు

 

తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ, తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అసత్య ప్రచారాలనూ నమ్మవద్దని కోరారు.

దర్శనం, వాహన సేవలు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వంటి వివరాల కోసం టీటీడీ, తిరుపతి పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, ప్రకటనలను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. పాత ఫోటోలు, వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరిస్తూ చేసే పోస్టులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. 

పోలీసులు లేదా టీటీడీ లోగో ఉన్నంత మాత్రాన అది అధికారిక సమాచారమని భావించవద్దని, సంబంధిత వెబ్‌సైట్లు లేదా అధికారిక వేదికల్లో నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగాయని, మార్గాలు మూసివేశారని వచ్చే నిర్ధారణ లేని సందేశాలు చూసి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా తిరుమల, తిరుపతిలో విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. మొత్తం 6,071 మంది పోలీసు సిబ్బందిని రెండు దశల్లో బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు వివరించారు. 

వీరిలో తిరుమలలో 4,783 మంది, తిరుపతిలో 1,288 మంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి క్రౌడ్ మేనేజ్‌మెంట్, భక్తులతో వ్యవహరించాల్సిన తీరు, తిరుమల పవిత్రత పరిరక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.

భక్తుల్లో భయాందోళనలు సృష్టించే పోస్టులు కనిపిస్తే, వాటి స్క్రీన్‌షాట్లు లేదా లింకులను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని లేదా దగ్గర్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించాలని తెలిపారు. 

విధుల్లో ఉన్న పోలీసుల సూచనలు, అధికారిక మైక్ ప్రకటనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.