*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*.....
......
సూర్యాపేట: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. పీఓపీ విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.అలాగే వినాయక మండపాల వద్ద పరిశుభ్రతను పాటించాలని, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సారగండ్ల శ్రీనివాస్ ముదిరాజ్ , ఎం.డి. గౌసుద్దిన్, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, ఏనేపల్లి యాదగిరి, ఇండ్ల మనోజ్,పిట్టల.శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, మేడి నాగరాజు, మధు, బిక్షం, హరీష్,మోర. నరేష్, బి. నాగరాజు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.