BREAKING
మాజీ ఎంపీపీ నీ పరామర్శించిన బుట్టా దంపతులు ఎమ్మిగనూరు జేఎస్పీలో మార్పులు,,,,? మిస్టరీ యాక్షన్‌తో మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల! ఐపీఎల్ మెగా లేదా మినీ వేలం ఈసారికీ భారత్‌లోనే నిర్వహణ! జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా ‘కాన్వా’ సేవలు అందుబాటులోకి! రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. రూ.25 వేలకు పెరగనున్న వేతన పరిమితి! మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోటకొండ బీజేపీ ఎంపీటీసీ భగవాన్ టీమిండియాలో అగ్రస్థానంలో ఇషాన్ కిషన్.. రెండో స్థానంలో అభిషేక్ శర్మ అడివి శేష్ ‘జీ-2’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే? కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బిగ్ బాస్ హౌస్‌లో రసవత్తరంగా ముఖేష్, దేబ్జానీ లవ్ ట్రాక్.. వర్షిణితో ఎంట్రీపై జోరుగా చర్చ తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘మొద రాత్రి’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

క్యాబ్ కోసమే డ్రైవర్ హత్య

Select Suryaa Now
క్యాబ్ కోసమే డ్రైవర్ హత్య

హైదరాబాద్‌: బేగంపేటకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్యాబ్‌ను దొంగిలించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ముందుగా ప్యాసింజర్లుగా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్న నిందితులు.. పటాన్‌చెరు దాటిన అనంతరం డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు.

క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు డ్రైవర్‌ రాజశేఖర్‌తో సీటు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వైర్‌తో ఆయన గొంతు బిగించి హత్య చేసినట్లు తేలింది. ముఖంపై కూడా దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం రాజశేఖర్‌ మృతదేహాన్ని రుద్రారం సమీపంలోని రోడ్డుపక్కన పడేసి నిందితులు క్యాబ్‌తో పరారయ్యారు.

క్యాబ్‌ దొంగతనం కోసమే ఈ హత్యకు పన్నాగం పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, క్యాబ్‌ దొంగతనం వెనుక ఉన్న ఉద్దేశాలపై మరింత విచారణ చేస్తున్నారు.