BREAKING
ఐపీఎల్ మెగా లేదా మినీ వేలం ఈసారికీ భారత్‌లోనే నిర్వహణ! జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా ‘కాన్వా’ సేవలు అందుబాటులోకి! రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. రూ.25 వేలకు పెరగనున్న వేతన పరిమితి! మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోటకొండ బీజేపీ ఎంపీటీసీ భగవాన్ టీమిండియాలో అగ్రస్థానంలో ఇషాన్ కిషన్.. రెండో స్థానంలో అభిషేక్ శర్మ అడివి శేష్ ‘జీ-2’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే? కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బిగ్ బాస్ హౌస్‌లో రసవత్తరంగా ముఖేష్, దేబ్జానీ లవ్ ట్రాక్.. వర్షిణితో ఎంట్రీపై జోరుగా చర్చ తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘మొద రాత్రి’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ధరణి పేరుతో భూ రికార్డుల్లో అక్రమాలు.. కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రామ్‌ కార్తీక్ ‘మిస్సింగ్ మేఘన’.. సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్! బేగంబజార్‌లో గోల్డ్ ప్లేటెడ్ వినాయక విగ్రహంపై దుమారం.. అసలు నిజం ఇదీ!

రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ

Select Suryaa Now
రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ

 

నంద్యాల అర్బన్: రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు నిరుద్యోగ సమస్యలు పోలీస్ కానిస్టేబుల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో ఉన్న డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు దుర్గ సాయి, నాయకులు రూపేష్, చరణ్, తేజ, చరణ్ తేజ రెడ్డి, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. -పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపై నిర్బంధనలు ఆపాలి
-ఇప్పుడు ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ పోస్ట్ లు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల విడుదల చేయాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారని రోజు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని నారా లోకేష్ పాదయాత్ర యువగలం లో మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని అదేవిధంగా మా ప్రభుత్వం అధికారులనుకొస్తే అక్రమ అరెస్టులు ఉండవు మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇస్తాము అని ఆనాడు యువతకు ఆయన హామీ ఇచ్చాడు. అదే విధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు నిరుద్యోగులు రోడ్లమీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగితే ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీస్తున్నారని అదే విధంగానే పోలీస్ శాఖలో 11639 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని విడుదల చేయండి అని నిరుద్యోగులు రోడ్లపైకొస్తే నిరసనలు చేస్తుంటే వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు నిబంధనలు చేస్తున్నారు. అనేక ఆంక్షలు విధిస్తున్నారు కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి తిని తినక రూమ్లలో ఉంటున్నారు తక్కువ పోస్టులు విడుదల చేశారని రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఇది కోచింగ్ సెంటర్ల వాళ్ళు చేపిస్తున్నారని అదే విధంగానే మరో పార్టీ చేపిస్తుందని చేపిస్తుందని వారిపై ఆరోపణ చేయడం సరైనది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోచింగ్ సెంటర్లపై ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదని అదే విధంగానే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ సమస్య పైన పోస్టులు పెంచుతున్నామని చెప్పడం లేదు కానీ వారిని బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చెప్పేదేమిటంటే గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోలేదు అందుకే ఆ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఇదే తీరుతో నిరుద్యోగులను నిరుద్యోగులకు మద్దతుగా నిలిచే సంఘాలను ఇబ్బందులు గురి చేస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిందే వస్తుందని అలాగే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు జిల్లాకు సివిల్ కానిస్టేబుల్ 23 ఏఆర్ కానిస్టేబుల్ 11 నంద్యాల జిల్లాకు ఇవ్వడం జరిగింది జిల్లాలో దాదాపు 50 నుంచి 70 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా అని రిజర్వేషన్ కోట కింద చూసుకుంటే క్యాస్ట్ కు రెండు నుంచి మూడు పోస్టులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నామని లేని పక్షాన చలో విజయవాడకు కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని దీనిపైన ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించు వినాయక అంటూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు.*