ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలి
-సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు
-ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల అర్బన్:
నా స్వస్థలమైన నంద్యాలలో, భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దే యువతీ యువకుల మధ్య ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోందని, ఒక రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా శాశ్వత మార్పు రావాలంటే అది యువశక్తితోనే సాధ్యమని, అందుకే మా మంచి కూటమి ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి భద్రతకు పెద్దపీట వేస్తోందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
బుధవారం నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యువత భవిష్యత్ కు భరోసా అను సదస్సును ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నా స్వస్థలమైన నంద్యాలలో భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దే యువతీ యువకుల మధ్య ఈ సదస్సు ప్రారంభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంధోందని, రాష్ట్రంలో నైనా, దేశంలో నైనా శాశ్వత మార్పు రావాలంటే అది యువ శక్తి తోనే సాధ్యం అని, మా మంచి ఉమ్మడి ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి భద్రతకు పెద్ద పీఠ వేస్తోందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
ఒకప్పుడు రాయలసీమ అనగానే తీవ్ర వర్షాభావం, రైతుల కష్టాలు, ఉపాధి లేక వలసలు గుర్తుకొచ్చేవి. కానీ నేడు పరిస్థితులు మారాయని. మన ప్రాంతం కరువుతో పోరాడే స్థితి నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని. పరిశ్రమల రాకతో రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోతోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గ్లోబల్ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికి వస్తున్న భారీ పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయనీ. రాజకీయాల్లో విలువలు, అభివృద్ధిలో పారదర్శకత ఉండాలని కోరుకునే నేటి తరం.. దేశ నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలని. మీ ఓటు హక్కు ద్వారా సమాజ భవితవ్యాన్ని మార్చే నాయకత్వాన్ని ఎన్నుకోండని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు.
విద్యార్థులతో ముఖాముఖి & వ్యవస్థాపకతపై సందేశం
ప్రసంగం అనంతరం ఎంపీ విద్యార్థులతో నేరుగా సంభాషించారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్టార్టప్ ఆలోచనలు, ప్రాంతీయ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, 'మీతో' (మీతో) యాప్ వ్యవస్థాపకుడు న్యాస పవన్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ.."ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడమే నిజమైన విజయం; విద్యార్థులు స్టార్టప్‌లు, ఆవిష్కరణల వైపు ముందడుగు వేయాలి" అని పిలుపునిచ్చారు.
శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
"శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'భవిష్యత్తుకు భరోసా' కార్యక్రమాన్ని మొట్టమొదటిగా నిర్వహించడం మాకెంతో గర్వకారణం. యువత ఆలోచనలే దేశ నిర్మాణానికి బలమైన పునాదులు. నేటి తరం విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ, సరికొత్త దృక్పథం ఉన్నాయన్నారు. వారికి సరైన మార్గదర్శకత్వం, చేయూత లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని,
మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి విద్యార్థులకు, ముఖ్యంగా యువతులకు గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారన్నారు. గతంతో పోలిస్తే విద్యా రంగంలో మౌలిక వసతులు, సాంకేతిక అవకాశాలు విప్లవాత్మకంగా మెరుగయ్యాయని. విద్యార్థులు ఈ వనరులను సద్వినియోగం చేసుకొని సమాజ హితం కోసం తమ వంతు కృషి చేయాలి. యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఇలాంటి వేదికలను కల్పిస్తున్న ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.అన్నారు.
కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి మాట్లాడుతూ
"ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం. మన దేశ అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి పూర్తిగా యువత తీసుకునే నిర్ణయాలు, చూపే చొరవపైనే ఆధారపడి ఉన్నాయని, రాబోయే తరాల గమనాన్ని, గమ్యాన్ని తిరగరాయగల శక్తి ఒక్క యువతరానికి మాత్రమే సొంతం అన్నారు.
రాష్ట్రంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, ఈ అవగాహన సదస్సును ప్రారంభించేందుకు మన కళాశాలకు ప్రాధాన్యతనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను (Problem-solving స్కిల్స్) అలవర్చుకోవాలి. నిరంతరం నేర్చుకునే తపనను అలవర్చుకున్నప్పుడే ప్రపంచ పోటీని తట్టుకొని నిలబడగలరన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ పి జి కళాశాల డీన్ ఎ ఎస్ ప్రగతి, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.