కళ్లపూర్ భూముల పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
కాళ్లపూర్‌లో పట్టా భూములు మినహాయించి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి
అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రి
పరిగి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 16): కాళ్లపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ కోసం చేపట్టనున్న భూసేకరణలో పేద రైతులకు చెందిన పట్టా భూములకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం సుమారు 160 ఎకరాల పట్టా భూములు భూసేకరణ పరిధిలోకి వస్తున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.పేద రైతులకు చెందిన పట్టా భూములను భూసేకరణ నుంచి మినహాయించి, కేవలం అసైన్‌మెంట్ భూములను మాత్రమే ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఇతర గ్రామాల్లో అందుబాటులో ఉన్న అసైన్‌మెంట్ భూములను ప్రత్యామ్నాయంగా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్తులతో చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరిస్తూనే పేద రైతుల భూములకు నష్టం జరగకుండా భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
*పరిగికి ఐఆర్‌సీ, ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేయాలి:
పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కాంప్లెక్స్ (ఐఆర్‌సీ)తో పాటు ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేయాలని ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్‌రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిని అసెంబ్లీలో కోరారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రావడానికి ఈ కార్యాలయాల ఏర్పాటు అవసరమని ఆయన వివరించారు.ఎమ్మెల్యే విజ్ఞప్తిపై రెవెన్యూ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.