BREAKING
ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి ప్రశాంతంగా గణపతి నిమజ్జనం చేపట్టాలి బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం ఓపీ జిందాల్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం భారత్‌కు భారీ అవకాశం ప్రపంచ వృద్ధికి భారత్‌ చోదకశక్తి: ఐఎంఎఫ్ కేరళలో విద్యుత్ సంక్షోభం కోరుట్లలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య రష్యా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భారత్‌ ఒక బాధ్యతాయుతమైన భద్రతా భాగస్వామి బీహార్‌లో వరద తీవ్రత...కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తృత పర్యటన ఉత్తరాఖండ్ సీఎం ధామికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భూటాన్‌లో జైశంకర్ పర్యటన మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ కూల్చివేత: సౌదీ సంకీర్ణ దళాలు

ఓపీ జిందాల్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం

Select Suryaa Now
ఓపీ జిందాల్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం

సోనిపట్:హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ప్రసిద్ధ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆయనకు వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో "ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్" (పాలనలో నవకల్పనలు: ఒక స్టార్టప్ రాష్ట్ర కథనం) అనే అంశంపై కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర రూపకల్పన, గత దశాబ్ద కాలంలో సాధించిన అభివృద్ధి, పరిశ్రమలు, సాంకేతిక రంగాలు మరియు పాలనలో తీసుకొచ్చిన నూతన వినూత్న విధానాలను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, మేధావులతో పంచుకోనున్నారు.