వెటర్నరీ డాక్టర్ నియామకానికి దేవాదాయ శాఖ అంగీకారం
సూర్య వేములవాడ రూరల్:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం వెటర్నరీ డాక్టర్ నియామకానికి రాష్ట్ర దేవాదాయ శాఖ సమ్మతి తెలిపింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు ఒక వెటర్నరీ సర్జన్, ఒక వెటర్నరీ అసిస్టెంట్ ను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవడానికి అనుమతిస్తూ ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.