బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన
బషీరాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): గ్రామంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ సంధ్యా నాయక్ తండా మాజీ సర్పంచ్ శంకర్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళనకు దిగారు.తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మాజీ సర్పంచ్ ఆందోళనతో కొద్దిసేపు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న బషీరాబాద్ పోలీసులు కార్యాలయానికి చేరుకుని మాజీ సర్పంచ్ శంకర్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించినట్లు సమాచారం.