పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ఇటీవల పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బందిని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు.జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన నారాయణమ్మ, సంగమేష్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన శంకరయ్య, కిష్టయ్య, పండు, జైపాల్ రెడ్డిలు మంగళవారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదోన్నతికి అనుగుణంగా మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని అన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.