గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు
గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్, ప్రసిద్ధ తేరు బజార్‌లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక తేరు బజార్ యువ వినాయక మండలి, సందుగుడి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొని గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి మండపాల్లో పుష్పార్చన చేసి, విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ఎమ్మిగనూరు ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. రైతులకు అనుకూల వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారులు, చేనేత కార్మికులు, కార్మికులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.