నవ నారసింహులకు అభిషేకం
నంద్యాల అర్బన్: తెలుగు పేటలోని శ్రీ మద్దులేటి లక్ష్మీ నృసింహా స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ మూలమూర్తికి పంచామృత అభిషేకం అనంతరం దాతల ఆధ్వర్యంలో నవ నారసింహులకు అభిషేకం చేశారు. స్వామివారిని వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి నివేదన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులు, దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.