BREAKING
తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంబం.. గుడ్ న్యూస్ చెప్పిన నటి సచిన్ రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్‌తో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్! వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు. నవ నారసింహులకు అభిషేకం చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మండాడి’.. రూ.65 కోట్ల వసూళ్లు సాధించిన సుహాస్ చిత్రం పాక్ సైనిక మద్దతు నిరాకరణ.. బాబ్ ఎల్-మాండెబ్ రక్షణకు ఇజ్రాయెల్ వైపు సౌదీ చూపు ధర్మవరంలో ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ.2 వేల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీల వెనుక అసలు నిజం ఇదే! నారా లోకేశ్ నాయకత్వ లక్షణాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: పంచుమర్తి అనురాధ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం సంవత్సరి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు అక్టోబర్ 2న అట్టహాసంగా ‘అనకాపల్లి’ సినిమా విడుదల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త చరిత్ర.. 800 పాయింట్లు దాటిన తొలి భారత బౌలర్‌గా రికార్డు! వినాయక మా గోడు వినవయ్య

పాక్ సైనిక మద్దతు నిరాకరణ.. బాబ్ ఎల్-మాండెబ్ రక్షణకు ఇజ్రాయెల్ వైపు సౌదీ చూపు

Select Suryaa Now
పాక్ సైనిక మద్దతు నిరాకరణ.. బాబ్ ఎల్-మాండెబ్ రక్షణకు ఇజ్రాయెల్ వైపు సౌదీ చూపు

యెమెన్‌లో హౌతీలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ నిఘా సాయాన్ని కోరుతున్న సౌదీ
సౌదీకి సైనిక మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిన కీలక మిత్రదేశం పాకిస్థాన్
వ్యూహాత్మక బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని హస్తగతం చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌ను సంప్రదించిన సౌదీ యువరాజు
ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు లేకపోయినా సాయం కోరడంపై సర్వత్రా ఆసక్తి
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను నిలువరించేందుకు సౌదీ అరేబియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా శత్రుదేశంగా పరిగణిస్తున్న ఇజ్రాయెల్ నుంచి నిఘా సహకారాన్ని కోరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కీలక మిత్రదేశమైన పాకిస్థాన్ సైనిక సహాయం అందించేందుకు నిరాకరించడంతో, సౌదీ ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల యెమెన్‌లో హౌతీ (అన్సార్ అల్లా) మిలిటెంట్లు తమ దూకుడును మరింత పెంచారు. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది అత్యంత కీలకమైన మార్గం కావడంతో, సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇజ్రాయెల్ సహాయాన్ని కోరినట్లు సమాచారం. అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి వద్ద పొంచి ఉన్న ముప్పుపై నిఘా సమాచారాన్ని పంచుకోవాలని సౌదీ పరోక్షంగా విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించదు, పైగా ఇరు దేశాల మధ్య ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ, ఇజ్రాయెల్ సాయం కోరడం యెమెన్‌లో సౌదీ ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

అంతకుముందు, యెమెన్‌లో పోరాడేందుకు తమ సైన్యాన్ని పంపే ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. కేవలం సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రమే తమ బలగాలను వినియోగిస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు, అమెరికా, బ్రిటన్‌లు సైతం హౌతీలపై నేరుగా దాడులు చేసేందుకు విముఖత చూపుతూ, పరిమిత మద్దతుకే మొగ్గు చూపాయి. మిత్రదేశాలు నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో, హౌతీలను నిలువరించేందుకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఈజిప్టుతో పాటు ఇతర గల్ఫ్ దేశాల సహాయాన్ని కూడా కోరినట్లు సమాచారం.