సంవత్సరి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ:క్షమాపణ, కరుణ, వినయం మరియు సద్భావనలు ప్రతి ఒక్కరి చర్యలకు మార్గదర్శకంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పవిత్రమైన సంవత్సరి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా సందేశాన్ని పంచుకున్న ప్రధాని... క్షమ, దయ మరియు అనుబంధాలు ప్రతి మానవ సంబంధాన్ని మరింత బలపరుస్తాయని సంవత్సరి మనకు గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మానవులలో వినయం నిండాలని, ప్రతి చర్యలో దయాగుణం మరియు సద్భావన ప్రతిబింబించాలని కోరారు. తన సందేశాన్ని సాంప్రదాయ జైన పర్వదిన శుభాకాంక్షలైన "మిచ్ఛామీ దుక్కడం!"తో ముగించారు.