By సూర్య ప్రతినిధి
Updated : 15 Sep 2026 18:43 IST
Select Suryaa Now
వినాయకా మా గోడు వినవయ్య..
రోడ్డు వేయించాలి అంటూ చిన్నారుల వనూత్న విన్నపం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా వినతి పత్రాలు అందించిన అక్కడి అధికారులు స్పందించరు.. కౌన్సిల్ తీర్మానం చేసిన రోడ్డు విషయం పట్టించుకోరు.. అంటూ ఎమ్మినూరు పట్టణంలోని యువర్స్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్నంగా వినాయకునికి రోడ్డు లేని దుస్థితి నుండి విముక్తులు చేయాలంటూ వినూత్నంగా వినాయకునికి వినతి పత్రం అందించారు.. మంగళవారం వినాయక మా విఘ్నాలు తొలగించి.. మా విన్నపం వినవయ్య.. మా రోడ్డు సమస్య తీర్చవయ్యా.. అంటూ ఎమ్మినూరు పట్టణంలోని 22వ వార్డు, వీవర్స్ కాలనీ, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం దగ్గర గల కాలనీలోని చిన్నారులు కళ్యాణ్ , తమన్, భరద్వాజ్ , చైత్ర శ్రీ, వీక్షిత , చిన్న లు వినాయకునికి వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. తమ వీధిలో 45 సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు లేని కారణంగా నానా అవస్థలు పడుతున్నామని, అధికారులకు , నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటుచేసిన వినాయకునికి వినతి పత్రాన్ని అందించి తమ సమస్యను విన్నవించారు.