BREAKING
ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా… పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం వాడవాడలా వెలసిన గణపయ్యలు యూకే వీసాల మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ.. పోలీసుల ముందు విచిత్రమైన డిమాండ్ రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక ఆసక్తికరమైన విషయాలు.. జంక్షన్, రోడ్డు, టెర్మినస్‌లకు అర్థం ఇదీ! అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ వైద్యరంగంలో కలకలం రేపుతున్న నకిలీ మందులు, బ్లాక్ మార్కెట్ దందాలు టెన్ ఇన్-సర్వీస్ టెట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు సెప్టెంబర్ 17 వరకు గడువు తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంబం.. గుడ్ న్యూస్ చెప్పిన నటి సచిన్ రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్‌తో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్!

వాడవాడలా వెలసిన గణపయ్యలు

Select Suryaa Now
వాడవాడలా వెలసిన గణపయ్యలు

 

ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్

పూడూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సొసైటీ వైస్ చైర్మన్ సురేందర్ ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని ఏన్కేపల్లి గ్రామంలో ఆదర్శ మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగాఆయన  మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరికీ వినాయకుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, మాజీ ఉపసర్పంచ్ నరేందర్, వార్డు సభ్యుడు ప్రసాద్ గౌడ్, యువజన అధ్యక్షుడు నవీన్, శివ, శ్రీశైలం, ప్రేమ్ సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.