కరీంనగర్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు చేపట్టిన స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెగా కిచెన్‌ను సందర్శించిన మంత్రి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.