నంద్యాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే మన ఏకైక లక్ష్యం: నంద్యాల టిటిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కౌన్సిలర్లుగా గెలిపించే బాధ్యత మాదిఫరూక్ కొడుకులు ఎన్నడూ తప్పుడు పనులు చేయరు : ఎన్ఎండీ ఫిరోజ్అబద్ధపు ప్రచారాలు, ఫేక్ వార్తలను నంద్యాల ప్రజలు నమ్మరుప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించే వారికే ఓట్లు – సినిమా డైలాగులు పనిచేయవు
నంద్యాల టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, బూత్, వార్డు ఇన్‌ఛార్జ్‌ల సన్నాహక సమావేశం
నంద్యాల అర్బన్:రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు . నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మునియార్ ఖలీల్ అధ్యక్షతన నిర్వహించిన నంద్యాల టౌన్ క్లస్టర్, బూత్, వార్డు ఇన్‌ఛార్జ్‌లతో ఆయన విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే కౌన్సిలర్లను, నాయకులను, మహిళా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ మరో నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, మనమంతా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 20 సంవత్సరాల తర్వాత నంద్యాల మున్సిపల్ పీఠంపై టీడీపీ జెండా ఎగరేయడమే మన లక్ష్యమన్నారు. గత రెండేళ్లుగా రాత్రింబవళ్లు పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలను కౌన్సిలర్లుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
గత కొద్ది రోజులుగా తమపై కొందరు కుట్రపూరితంగా ఫేక్ వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. "ఫరూక్ గారి కుటుంబం, ఆయన కొడుకులు ఎన్నడూ తప్పుడు పనులు చేయరు, తప్పు చేసేవారిని ప్రోత్సహించరు అని తేల్చి చెప్పారు. ఎవరి ఆస్తులను లాక్కోలేదు, ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టలేదు" అని ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్ని అసత్యాలు రాసినా, ప్రచారం చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు .
వైసీపీ నేతలు నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ఎన్నికల ముందు మాత్రమే వచ్చి రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల పిలుపునకు అర్ధరాత్రయినా స్పందిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పెన్షన్లు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు . పెండింగ్‌లో ఉన్న అంతర్గత రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
"ఇది సినిమా కాదు... డైలాగులు చెప్పి, మీసాలు తిప్పితే ఇక్కడ ఓట్లు పడవు. ప్రజల్లో ఉండి పని చేసి చూపిస్తేనే ఓట్లు వేస్తారు అని అన్నారు . పులులు, సింహాలు లాంటి మాటల డ్రామాలు కట్టిపెట్టి ప్రజా సేవ చేయాలి" అని హితవు పలికారు.
టీడీపీ నాయకులు , కార్యకర్తలు వార్డుల్లో ప్రతి ఇంటికీ వెళ్లాలని, అవసరమైతే వందసారైనా ప్రతి గడప తొక్కి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ ఉదయం 5 గంటలైనా, రాత్రి 10 గంటలైనా వార్డుల్లో ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా ముందుకు సాగి నంద్యాలలో తిరుగులేని విజయం సాధించాలని కోరారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ వార్డు, బూత్ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.