ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగనీరు
ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటల తాగునీరు.. ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ₹156.70 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి రాళ్లదొడ్డి, ఎర్రకోట గ్రామాల సమీపంలో ఎమ్మిగనూరు పట్టణ ప్రవేశం వద్ద జరుగుతున్న పైప్‌లైన్ పనులను పరిశీలించారు. శంకుస్థాపన అనంతరం పనులు వేగంగా కొనసాగుతున్న తీరును పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మాజీ మంత్రి స్వర్గీయ బి.వి. మోహన్ రెడ్డి చిరకాల స్వప్నమైన ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటల తాగునీటి సరఫరాను సాకారం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక అడుగు అని ఎమ్మెల్యే డాక్టర్ బివి పేర్కొన్నారు.
గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది అన్నారు.