BREAKING
ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలి వాయు కాలుష్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్య ఆలోచనలు: పరిశోధనలో షాకింగ్ విషయాలు ఆస్పత్రిలో పాము... భయాందోళనలో రోగులు భారత అథ్లెట్ల కోసం ఐఐటీ ఢిల్లీతో టెక్నోస్పోర్ట్ కీలక భాగస్వామ్యం నంద్యాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే మన ఏకైక లక్ష్యం: నంద్యాల టిటిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పెళ్లిబంధంలో 20 ఏళ్లు పూర్తి.. మళ్లీ గ్రాండ్‌గా వివాహం చేసుకున్న సూర్య, జ్యోతిక అధికార వర్గంలో అసమ్మతి పోరు...! భారత్‌తో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం.. అక్టోబర్ నుంచి అమల్లోకి? సంగీత ప్రాధాన్యతతో ‘పాటకు ప్రాణం’ చిత్రం.. హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం! కళ్లపూర్ భూముల పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి ప్రశాంతంగా గణపతి నిమజ్జనం చేపట్టాలి బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం

ఆస్పత్రిలో పాము... భయాందోళనలో రోగులు

Select Suryaa Now
ఆస్పత్రిలో పాము... భయాందోళనలో రోగులు


సూర్య వేల్పూరు :

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్ పరిసరాల్లో భారీ పెంజరపాము స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.పక్కనే వందలాది మంది విద్యార్థులు హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. రాత్రి వేళల్లో, పగటి పూట కూడా పాము కనిపిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు సైతం భయంతో వణికిపోతున్నారు.ఈ విషయంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు, ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎవరూ స్పందించలేదని ఆరోపిస్తున్నారు. పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరిది? అధికారులు వెంటనే స్పందించి పామును పట్టుకోవడంతో పాటు, ఆసుపత్రి, హాస్టల్ పరిసరాల్లో శుభ్రత పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.