BREAKING
మిస్టరీ యాక్షన్‌తో మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల! ఐపీఎల్ మెగా లేదా మినీ వేలం ఈసారికీ భారత్‌లోనే నిర్వహణ! జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా ‘కాన్వా’ సేవలు అందుబాటులోకి! రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. రూ.25 వేలకు పెరగనున్న వేతన పరిమితి! మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోటకొండ బీజేపీ ఎంపీటీసీ భగవాన్ టీమిండియాలో అగ్రస్థానంలో ఇషాన్ కిషన్.. రెండో స్థానంలో అభిషేక్ శర్మ అడివి శేష్ ‘జీ-2’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే? కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బిగ్ బాస్ హౌస్‌లో రసవత్తరంగా ముఖేష్, దేబ్జానీ లవ్ ట్రాక్.. వర్షిణితో ఎంట్రీపై జోరుగా చర్చ తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘మొద రాత్రి’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ధరణి పేరుతో భూ రికార్డుల్లో అక్రమాలు.. కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రామ్‌ కార్తీక్ ‘మిస్సింగ్ మేఘన’.. సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి

Select Suryaa Now
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి

 -కేంద్ర ప్రభుత్వ పథకాల పూర్తి స్థాయి అమలకు నిధులను సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ100 శాతం నిధులను వినియోగించుకోవాలి

-కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చేపడుతున్న పనులు నాణ్యతతో  చేపట్టాలి

-ప్రతిపాదనలు సకాలంలో సిద్ధం చేసి నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల అర్బన్:నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి : ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ*

*నంద్యాల, సెప్టెంబర్ 16: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి, వాటి ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు సకాలంలో అందేలా చూడాలనీ, పథకాల అమలకు నిధులను సద్వినియోగం చేసుకోవాలనీ నంద్యాల పార్లమెంటు సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బైరెడ్డి శబరి తెలిపారు.*

*బుధవారం కలెక్టరేట్ లోని PGRS హాల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశ) సమావేశంలో నంద్యాల పార్లమెంటు సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ,జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.సుధాకర్ రెడ్డి, డిప్యూటీ సిఈవో సుబ్బారెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..జిల్లా పరిధిలో వివిధ శాఖల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సాధించిన పురోగతి ఎదురవుతున్న సమస్యలపై  సమగ్రంగా చర్చించారు. విద్య, వైద్య రహదారులు, నీటి వనరులు, పశుసంవర్ధక శాఖ తదితర కీలక శాఖలు అమలు అవుతున్న కార్యక్రమాలను శాఖల వారిగా సమీక్షించారు.*

*ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి, వాటి ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు సకాలంలో అందేలా చూడాలనీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతి, నిర్దేశిత లక్ష్యాలు, ఇంకా పూర్తి కావాల్సిన పనులు, ఎదురవుతున్న సమస్యలు, పనుల జాప్యానికి గల కారణాలను చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరమైన సరిదిద్దే చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులు త్రైమాసిక సమీక్షల ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పరస్పర సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో సమగ్ర అభివృద్ధికి మరింత వేగం చేకూరేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. జిల్లాను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.*

*జిల్లా కలెక్టర్ వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, భూ రికార్డులు, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, RWS, R&B, విద్యుత్, పౌర సరఫరాలు, స్కిల్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ తదితర 70కి పైగా శాఖలు, అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు మంజూరు అయ్యే నిధులను నిర్ణీత గడువులోగ చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మొదటి త్రైమాసికంలో కేటాయించిన నిధుల్లో 82 శాతం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నిధులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్ష, గిరిజన సంక్షేమం తదితర శాఖలు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. PM-SHRI పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు తదితర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని అన్నారు. PM-JANMAN కింద చేపడుతున్న రహదారులు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, తదుపరి త్రైమాసిక సమీక్ష నాటికి నిర్దేశిత లక్ష్యాల మేరకు 100 శాతం పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా నిరంతరం పర్యవేక్షించాలని, నిధుల వినియోగం, పనుల నాణ్యత, లక్ష్య సాధనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సంబంధించి నిధులు విడుదలకు అవసరమైన ప్రతిపాదనలను వివిధ శాఖల అధికారులు సకాలంలో సిద్ధం చేయాలన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదన కూడా వీలైనంత త్వరగా అందజేయాలని తెలిపారు. నందికొట్కూరు మెడికల్ అండ్ హెల్త్ శాఖకు సంబంధించి ఇచ్చిన ఆరోపణపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనాధ శరణాలయాలు అంగన్వాడి కేంద్రాల పనితీరు మౌలిక వసతులు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గడివేముల నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో కె.సి కెనాల్ రోడ్డు మరమ్మత్తు పనులను త్వరగా తమ పూర్తి చేసి ప్రజలకు రహదారి అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు.*

*ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు మాట్లాడుతూ..ఆళ్లగడ్డ నియోజకవర్గం లో అమలు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతికి నిధుల సద్వినియోగం గురించి సంబంధిత శాఖల అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు.* *కేంద్ర ప్రభుత్వాలు పథకాలు నిధులు సద్వినియోగం ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలకు పూర్తిస్థాయిలో నిధులను వినియోగించి నియోజకవర్గం అభివృద్ధికి  తోడ్పడాలన్నారు.* *పశు  సంవర్ధక శాఖ ఆధర్వంలో అమలవుతున్న ABIP, NAIP కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.*

*డిఐపిఆర్ఓ, నంద్యాల*