టీడీపీ–జనసేన సమన్వయంతో ఎన్నికల కార్యాచరణపై కీలక సమావేశం
పెనమలూరు, మేజర్ న్యూస్: పెనమలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ–జనసేన పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ త్రీమెన్ కమిటీ సభ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, పరస్పర సమన్వయం, కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కొమ్మాలపాటి శ్రీధర్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా