స్థానిక పోరుకు .. వైసీపీలో రెబల్స్
స్థానిక పోరుకు .. వైసీపీలో రెబల్స్
.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ వైస్ చైర్మన్ రంగం సిద్ధమేనా..?
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
వైసిపి అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రధాన అనుచరులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతూ ఎర్రకోట కుటుంబానికి చేదుడు, వాదోడు గా ఉన్న వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్
స్థానిక పోరు లో భాగంగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 44 స్థానాలకు 44 మంది అభ్యర్థులను వైసీపీకి రెబల్గా పోటీ చేయిస్తారని ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో తానే స్వయంగా చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డి పార్టీలో సీనియర్ నేతలు కలుపుకొని పోవడం లేదన్న భావనతోనే ఎమ్మిగనూరులో రెబల్ అభ్యర్థులుగా స్థానిక ఎన్నికల్లో నిలిచేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం..
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కైవాసం చేసుకునేందుకు అధికార కూటమి పార్టీ ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిని చేనేత కుటుంబానికి అందించే విధంగా రంగం సిద్ధం చేసు ఉన్నట్లు తెలుస్తుంది.. 44 వార్డుల్లో వైసిపి కూడా గట్టి పోటీగా నిలువాలనుకుంటుంది. ఇందుకోసం రేపు ఎమ్మిగనూరు పట్టణంలోని వైసీపీ శ్రేణులతో పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు 34 వార్డులతో ఉన్న ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 44 వార్డులకు చేరుతుంది.. ఇక రాజకీయ ఉద్యోగస్తులకు సీట్లు కొదవలేదని చెప్పవచ్చు.. కానీ అటు కూటమిలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఇటు ప్రతిపక్షంలో ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఇద్దరు జంజీ నిదానం ఎత్తుకొని ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.. రాజకీయాల్లోకి యువత రావాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని సీనియర్ నాయకులను పక్కనపెట్టి స్థానిక ఎన్నికలకు సమాప్తం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు. వైసీపీలో మారిన రాజకీయ పరిణామాలతో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వర్గంలో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఏ కారణం చేతనో ఎర్రకోట కుటుంబానికి దూరమయ్యారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక చెంతన ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే నజీర్ అహమ్మద్ బాహటంగానే స్థానిక ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు పోటీగా ఉంటారని పేర్కొంటూ ఉండడం చూస్తుంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి రెండు వర్గాలుగా ఎన్నికల బరిలో నిలుస్తుంది అన్నమాట..