BREAKING
లడఖ్‌లో సీబీఎస్‌ఈ ప్రత్యేక తరగతులు నవ భారత శిల్పి ప్రధాని మోదీ భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు భారత డీప్-టెక్ సామర్థ్యాలపై ప్రధాని మోదీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో మెరిసిన 'గిఫ్ట్ సిటీ' వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్ సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన వృద్ధి 'భారత్ వన్' హరిత కార్యక్రమం ప్రారంభం దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ

పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

Select Suryaa Now
పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర మంత్రులు లేదా ప్రముఖుల పేరిట ప్రసారమయ్యే డీప్‌ఫేక్ వీడియోలను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అతి తక్కువ పెట్టుబడి పెడితే క్షణాల వ్యవధిలోనే వేలల్లో రాబడి వస్తుందంటూ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాలలో ఆకర్షణీయమైన ప్రకటనలను హోరెత్తిస్తున్నారు. రూ. 22 వేలు పెట్టుబడి పెడితే కేవలం ఒక్క రోజులోనే రూ. 60 వేల వరకు లాభం వస్తుందని, నెలకు లక్షల్లో సంపాదించవచ్చంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ హామీలతో కూడిన పథకాలను చూసి సామాన్యులు ఎవరూ నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ తరహా మోసాల కోసం నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నారు. కేంద్ర మంత్రులు, ప్రముఖ ఆర్థికవేత్తలు లేదా ప్రముఖ వ్యాపారవేత్తలు స్వయంగా ఈ పెట్టుబడి పథకాలను సిఫారసు చేస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. నిజమైన వీడియోల మాదిరిగానే కనిపించేలా వాటిని మార్ఫింగ్ చేసి ప్రజలను నమ్మిస్తున్నారు. సామాన్యులు వారి మాటలను నిజమని భ్రమపడి మోసపోవాలని చూస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రచారాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆఫర్‌ను గుడ్డిగా నమ్మకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎవరైనా అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం లేదా తెలియని వ్యక్తుల మాటలు విని ఆన్‌లైన్ యాప్‌లలో డబ్బులు జమ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సైబర్ మోసాల బారిన పడితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు జరిపే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను పరిశీలించుకోవడం ఎంతో ఉత్తమం.