BREAKING
లడఖ్‌లో సీబీఎస్‌ఈ ప్రత్యేక తరగతులు నవ భారత శిల్పి ప్రధాని మోదీ భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు భారత డీప్-టెక్ సామర్థ్యాలపై ప్రధాని మోదీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో మెరిసిన 'గిఫ్ట్ సిటీ' వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్ సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన వృద్ధి 'భారత్ వన్' హరిత కార్యక్రమం ప్రారంభం దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ

ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త

Select Suryaa Now
ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త

బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీని "ఆధునిక భారతదేశ సృష్టికర్త"గా అభివర్ణిస్తూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆయనకు 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ చేసిన 25 ఏళ్ల 'తపస్సు' కోట్లాది మంది భారతీయుల జీవితాల్లోనూ, ఆలోచనా విధానంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. మోదీ దృఢమైన నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి, స్వయం సమృద్ధిలలో కొత్త శిఖరాలను అధిరోహిస్తూ ప్రపంచ వేదికపై బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంటోందని అన్నారు.

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన నెల రోజుల 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నబిన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పుట్టినరోజును 'సేవా దివస్'గా జరుపుకుంటూ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

సాయంత్రం 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రధాని దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలని కోరారు. విశ్వకర్మ జయంతి రోజే ఆధునిక భారత నిర్మాత మోదీ పుట్టినరోజు రావడం విశేషమని, ఈ కార్యక్రమాలు 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధన దిశగా దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని నబిన్ తెలిపారు.