విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు
ప్రధాని మోదీ పుట్టినరోజున 'సేవా దివస్'
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) గురువారం నాడు 'సేవా దివస్' నిర్వహించింది. ఇందులో భాగంగా విజయ్ చౌక్ వద్ద 1.25 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఎన్డీఎంసీ వైస్ చైర్‌పర్సన్ కుల్‌జీత్ సింగ్ చాహల్‌తో పాటు కేంద్ర పథకాల లబ్ధిదారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోధి కాలనీ పార్కులో 'మియావాకీ పద్ధతి' ద్వారా 10,000 స్థానిక రకాల మొక్కలతో 'భారత్ వన్' పట్టణ అడవి ప్రాజెక్టును ప్రారంభించి మొక్క నాటారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, అంకితభావాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు.