నవ భారత శిల్పి ప్రధాని మోదీ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి కలిగిన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా గురువారం లక్నోలో నిర్వహించిన 'ఆశీర్వాద దీపం' కార్యక్రమంలో పాల్గొని ఆయన మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించారు.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడు విశ్వానికే శిల్పి అయితే, ప్రధాని మోదీ నవ భారత శిల్పి అని అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని, ప్రతి పౌరుడు గర్వపడేలా దేశం పురోగమిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కోరుకుంటూ దేశవ్యాప్తంగా 'ఆశీర్వాద దీపం' కార్యక్రమం మరియు నదీ తీరాల్లో హారతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.