BREAKING
లడఖ్‌లో సీబీఎస్‌ఈ ప్రత్యేక తరగతులు నవ భారత శిల్పి ప్రధాని మోదీ భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు భారత డీప్-టెక్ సామర్థ్యాలపై ప్రధాని మోదీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో మెరిసిన 'గిఫ్ట్ సిటీ' వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్ సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన వృద్ధి 'భారత్ వన్' హరిత కార్యక్రమం ప్రారంభం దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ

భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ

Select Suryaa Now
భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపే దిశగా ముందుకు నడిపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రధాని మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసిలో నిర్వహించిన 'వారణాసి-వడ్నగర్ సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

వారణాసి నుండి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ప్రధాని మోదీకి కాశీ 'కర్మభూమి' అని అభివర్ణించారు. ప్రధాని పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, 4 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందుతోందని గుర్తుచేశారు. 'మేక్ ఇన్ ఇండియా', స్టార్టప్‌లు, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. అలాగే మహిళా సాధికారత కోసం లఖ్‌పతి దీదీ, ఉజ్వల, నారీ శక్తి వందన్ అధినియమ్ వంటి పథకాలు విప్లవాత్మక మార్పులు తెచ్చాయని ప్రశంసించారు.

ఈ సందర్భంగా అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగీలతో కలిసి చంద్రబాబు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.