BREAKING
లడఖ్‌లో సీబీఎస్‌ఈ ప్రత్యేక తరగతులు నవ భారత శిల్పి ప్రధాని మోదీ భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు భారత డీప్-టెక్ సామర్థ్యాలపై ప్రధాని మోదీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో మెరిసిన 'గిఫ్ట్ సిటీ' వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్ సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన వృద్ధి 'భారత్ వన్' హరిత కార్యక్రమం ప్రారంభం దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Select Suryaa Now
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై:అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో గురువారం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో లభించిన లాభాలను చివర్లో వదులుకుని 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 21.86 పాయింట్లు పడిపోయి 74,314.59 వద్ద స్థిరపడగా, 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పంగా 53 పాయింట్లు పెరిగి 23,270.60 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టపోగా.. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మారుతి మరియు ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఫెడ్ నిర్ణయంతో పాటు యూఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) రూ. 2,032.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్లపై ప్రభావం చూపాయి.

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కి చెందిన భారీ రూ. 22,569 కోట్ల ఐపీఓ గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం కాగా, మొదటి రోజే 39 శాతం మేర సబ్‌స్క్రయిబ్ అయ్యి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 1.61 శాతం తగ్గి బ్యారెల్‌కు 104.1 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో నిక్కీ లాభపడగా.. కోస్పీ, షాంఘై, హాంగ్ సెంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.