BREAKING
పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.. ఇంతకీ 'ద్రుజ్బా దోస్తీ' అర్థం ఏమిటంటే! యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. వివిధ సర్వీసుల ఛార్జీలు పెంపు సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ.. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్! హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్

రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు  డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ  యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి


- ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్ ను తీర్చిదిద్దుతున్నాం 
- ⁠తెలంగాణకు అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్ రాకతో అగ్రగామి కార్పొరేట్ సంస్థల చూపు రాష్ట్రం వైపు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : ప్రపంచ ప్రఖ్యాత 'హార్వర్డ్ యూనివర్సిటీ' హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌'గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని యూకే బిజినెస్ స్కూల్స్ బృందం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి 
అన్నారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో నిర్వహించిన భేటీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక  పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రతినిధులతో సహా 30 మంది వివిధ యూకే యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వివిధ యూకే బిజినెస్ స్కూల్స్ కు సంబంధించిన డీన్లు, ఉన్నత స్థాయి అధికారులతో 
సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ, విశ్వవిద్యాలయాలకు అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. విదేశీ విద్యాసంస్థల రాకతో స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి, ఇక్కడే పరిశోధనలు చేపట్టడానికి దోహదపడుతుందన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. 
ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటి, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చన్నారు. అలాగే విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు 
సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ లో అక్కడ నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు బృందానికి ఆహ్వానం పలికారు. యూకే విద్యా వ్యవస్థలో ముఖ్యులందరికీ గ్లోబల్ సమ్మిట్ కు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి  వివరించారు.  దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్‌ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయి. టీసీఎస్ 70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటాసెంటర్ నిర్మించనుంది. లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటాసెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాలు, ఫార్చ్యూన్-500 కంపెనీలు తెలంగాణాలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యం గురించి 
సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.