BREAKING
పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.. ఇంతకీ 'ద్రుజ్బా దోస్తీ' అర్థం ఏమిటంటే! యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. వివిధ సర్వీసుల ఛార్జీలు పెంపు సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ.. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్! హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్

తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Select Suryaa Now
తెలంగాణకు భారీ వర్ష సూచన  ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు  శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

 

 

 

శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు

ఈ సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటికీ 19 శాతం వర్షపాత లోటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం (19వ తేదీ) నుంచి వర్షాల తీవ్రత పెరగనుందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ నిపుణుడు టి.బాలాజీ సైతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రాత్రి, తెల్లవారుజామున తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. నగరంలో రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణంగా 664.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 536.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది 19 శాతం లోటును సూచిస్తోంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లోనూ సాధారణ వర్షపాతం 550.8 మి.మీ. కాగా, ఇప్పటికి 432 మి.మీ. మాత్రమే కురిసింది. రానున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.