BREAKING
భీమేశ్వరుడి హుండీకి భారీ కానుకలు పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.. ఇంతకీ 'ద్రుజ్బా దోస్తీ' అర్థం ఏమిటంటే! యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. వివిధ సర్వీసుల ఛార్జీలు పెంపు సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ.. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్! హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి

"స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం - కాకాణి "

Select Suryaa Now
 "స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం - కాకాణి "


"స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం - కాకాణి "

నెల్లూరుబ్యూరో, మేజర్ న్యూస్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ  విస్తృత స్థాయి సమావేశంలో సర్వేపల్లి పరిశీలకులు వీరి చలపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్  కాకాణి పూజిత  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి  పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుబోలు మండల కేంద్రంలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ...అవినీతి, అక్రమాలు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా విస్తృత స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని . గ్రావెల్, మట్టి, బూడిద వంటి ప్రకృతి సంపదను విచ్చలవిడిగా సోమిరెడ్డి ముఠా దోచేస్తున్నారన్నారు ఇరిగేషన్ లో ​దొంగ బిల్లులతో దోపిడీ.. ఇరిగేషన్ లో రైతుల పేరు చెప్పి ఎలాంటి పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయల నిధులను కూటమి నాయకులు పక్కదోవ పట్టిస్తూ దోచుకుంటున్నారన్నారని కాకాణి ఆరోపించారు.నియోజకవర్గంలో దేవుడి భూములకు, ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని . వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారన్నారు

​రైతుల సమస్యలు..
సాగునీటి కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే కూటమి నాయకులు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావడంలో విఫలమయ్యారని మండి పడ్డారు,శ్రీశైలం నీళ్లు సోమశిలకు, సోమశిల నీళ్లు కండలేరుకు రాక నెల్లూరు జిల్లా మొత్తం బీడువారిపోయిందని  ఆవేదన వ్యక్తం చేశారు, రైతులు సాగు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు
అక్రమ సంతకాలు - గోవధ..
మనుబోలు సంత రూ. 81.10 లక్షలకు రికార్డ్ స్థాయిలో పాడారని, కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక  సంతను సరిగ్గా పాడకుండా, గొలగమూడి దగ్గర అక్రమంగా సంత పెట్టి నెలకు రూ. 10 లక్షలు చొప్పున తీసుకుంటూ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమ సంత ద్వారా గోవులను ఇతర రాష్ట్రాలకు తరలించి గోవధకు పాల్పడ్డాడని మండిపడ్డారు.
గోవధను ​స్థానిక నాయకులు అడ్డుకోవాలి.. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా  గోవధలు జరిగితే స్థానికంగా ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలు మరియు సాధారణ గోప్రేమికులు ఖచ్చితంగా అడ్డుకోవాలని కాకాణి పిలుపునిచ్చారు.మనం పవిత్రంగా భావించి పూజించే గోవులను హింసించి వధించే కార్యక్రమాలకు మద్దతుగా  నిలవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం.. అధికార పార్టీ నాయకులు సిఎస్ఆర్ నిధులపై కన్నేసి కంపెనీలను బెదిరించి నిధులను దోచుకుంటున్నారు. మా ప్రభుత్వం రాగానే వీటిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.
క్రెడిట్ చోరీ...
జగన్ మోహన్ రెడ్డి  హయాంలో 20 సంవత్సరాల అసైన్డ్ భూములపై పేద రైతులకు హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తే, చంద్రబాబు ప్రభుత్వం విచారణల పేరుతో 27 నెలలు వేధించింది. ఇప్పుడు మళ్లీ తామే ఫ్రీ హోల్డ్ ఇచ్చినట్లు జగనన్న చేసిన మంచి పనికి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.

కాకాణి పూజితమ్మ మాట్లాడుతూ...కార్యకర్తలకు అండగా వైఎస్సార్సీపీ..జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.పార్టీ కోసం పనిచేసే వారికి  ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు అందించి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ తీసుకురావాలి...
​సర్వేపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించాలని, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ఈ స్థానిక ఎన్నికల విజయమే నాంది కావాలని ఆమె పిలుపునిచ్చారు.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంట్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జగనన్న ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు."
​"అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోకే నిధులు జమ చేసి అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించిన ఏకైక నాయకుడు జగనన్న.అని పేర్కొన్నారు 
​కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ, మహిళా నాయకులకు గుర్తింపునిస్తూ ప్రాధాన్యత కల్పించడంలో జగనన్న ఎప్పుడూ ముందుంటారని తెలిపారు

​దిశా చట్టం & మహిళా భద్రతపై..
​"మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం జగనన్న తీసుకొచ్చిన 'దిశా చట్టం' మరియు 'దిశ యాప్' మహిళల చేతుల్లో ఒక శక్తివంతమైన రక్షణ ఆయుధంలా మారాయని,ఆపదలో ఉన్న మహిళలకు ఒక్క క్లిక్‌తో త్వరితగతిన రక్షణ కల్పించి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా ఈ చట్టం దిక్సూచిగా నిలిచిందని గుర్తు చేశారు
రాష్ట్రంలోని మహిళలందరికీ ఆపద్బాంధవుడిగా నిలిచి, భద్రతకు అత్యున్నత పీఠం వేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  దక్కుతుందని మనందరం కష్టపడి పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇద్దాం