BREAKING
దేశంలో 52కి చేరిన చిరుతల సంఖ్య పాక్-చైనా సరిహద్దు కమిషన్‌కు చట్టబద్ధత లేదు యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై నిషేధం భూటాన్‌లో జైశంకర్ పర్యటన CPSEల రుణ అర్హత, నిధుల సేకరణకు క్రెడిట్ రేటింగ్‌లు కీలకం దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వర్ధమాన సాంకేతికతలలో భారత్ అగ్రగామిగా నిలవాలి: ప్రధాని మోదీ స్థానిక పోరుకు .. వైసీపీలో రెబల్స్ నిరాశపరిచిన నిర్ణయం: హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త! హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఎలా ఆరోగ్యానికి మేలు? హంస వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు వెళ్లి రావయ్యా గణపయ్య దిగ్గజ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ షురూ.. ముఖ్మ అతిథిగా కమల్‌ హాసన్‌

యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై నిషేధం

Select Suryaa Now
యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై నిషేధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 
న్యూఢిల్లీ:చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా హోం మంత్రి వెల్లడించారు.

ఈ నెట్‌వర్క్ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. యువతను, చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్ర నెట్‌వర్క్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.