BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

పోరంకిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభం

Select Suryaa Now
పోరంకిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభం

పెనమలూరు మేజర్ న్యూస్ : నియోజకవర్గంలోని పోరంకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, స్థానికులతో కలిసి నూతన శాఖను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పెనమలూరు ప్రాంతం వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు కూడా ఆదరణ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు విస్తరించడం వల్ల ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. విజయవాడ ప్రాంతీయ విభాగం పరిధిలో ఈ నూతన శాఖ 49వ శాఖగా ఏర్పాటు చేసినట్లు బ్యాంకు రీజినల్ హెడ్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఖాతాదారులకు తక్కువ వడ్డీ రుణాలు, బంగారు రుణాలు, స్వయం సహాయక సంఘాలకు అవసరమైన రుణ సదుపాయాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నూతన శాఖ ప్రారంభంతో పెనమలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం కావడంతో పాటు, స్థానిక వ్యాపార కార్యకలాపాలకు మరింత తోడ్పాటు లభించనుంది.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.