నెల్లూరు రూరల్ 3వ డివిజన్‌లో మేకల మధు పావని విస్తృత ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ పరిధిలోని 3వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మేకల మధు పావని ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రచారంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత మేకల అనిల్ మాట్లాడుతూ, డివిజన్‌లో ప్రజల ఆదరణతో భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.