కారు ఢీకొని 18 గొర్రెలు ,మేకలు మృతి
కనిగిరి,మేజర్ న్యూస్ :పట్టణం లోని టకారి పాలెం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపాలెం కు చెందిన డబ్బుకొట్టు శ్రీను ,తన కుమారుడు గొర్రెలు ,మేకలు కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి వస్తుండగా పొదిలి వైపు నుండి కనిగిరి వస్తున్న కారు వేగంగా వచ్చి రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో 18 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన గొర్రెల కాపరి శ్రీను ,అతని కుమారుడు బాబు లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.2.70 లక్షలు ఉంటుందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రెల కాపరి శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు.