జగ్గయ్యపేటలో లాడ్జ్ మరియు రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేటలో లాడ్జ్ మరియు రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి చెందిన నూతన లాడ్జ్ మరియు రెస్టారెంట్‌ను జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య నూతనంగా ప్రారంభించిన లాడ్జ్ మరియు రెస్టారెంట్ యజమాని మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల లక్ష్మణరావు, కళ్యాణం కృష్ణారావు మరియు స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా