BREAKING
ఆర్‌బీఐ ఊరట చర్యలతో రూపాయి వేగవంతం ఓటీటీలో భయపెడుతున్న అద్భుతమైన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మిస్ కాకండి! బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. గ్రాండ్‌గా అడుగుపెట్టిన కొత్త కంటెస్టెంట్లు! విండ్ టర్బైన్ దిగ్గజం 'నోర్డెక్స్' ఆర్డర్లలో 30 శాతం వృద్ధి రామాయణ పార్ట్ 1' విడుదల తేదీ ఖరారు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఎప్పుడంటే! **పెద్దాయిపల్లిలో విషాదం.. పదేళ్ల బాలిక మృతి** పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు.. కానీ పిల్లల్ని కనండి: సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ వ్యాఖ్యలు! ఎగుమతులతో జోరు కొనసాగిస్తున్న చైనా ఆటోమొబైల్స్ ఆల్ ది బెస్ట్ విష్ణన్న..... 1.35 బిలియన్ డాలర్ల విలువకు చేరిన జర్మన్ క్లీన్‌టెక్ స్టార్టప్ '1కొమ్మా5గ్రాడ్' The Dirty Picture 2: 'డర్టీ పిక్చర్ 2' సీక్వెల్ ప్రకటన.. కానీ ఈసారి సిల్క్ స్మిత కథ కాదు! హూతీల దాడిపై..సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్, పాకిస్థాన్ తీవ్ర ఖండన పసిడి ప్రియులకు ఊరట.. సోమవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! ఢిల్లీలో ఆరు మెట్రో స్టేషన్లు మూసివేత, ట్రాఫిక్ ఆంక్షలు అబుదాబి టెస్టు: హసన్ మహమూద్ ఐదు వికెట్లు.. బంగ్లా ఆధిక్యం 329, ఆఫ్ఘన్‌పై పట్టు రహ్మత్ షా సెంచరీ వృథా.. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. శాంటో 82, ముష్ఫికర్ 81తో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 223/6

ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు టెక్నాలజీ కవచం

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు టెక్నాలజీ కవచం

దర్శన క్యూలైన్ల నుంచి ఘాట్‌ రోడ్ల వరకు ఆధునిక నిఘా

ఏఐ కెమెరాలు, డిజిటల్‌ డిస్‌ప్లేలు, స్మార్ట్‌ ట్రాకింగ్‌తో రద్దీ నియంత్రణ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనం, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు రూపొందించింది. దసరా–2026 ఐటీ ప్రణాళికలో భాగంగా దర్శన క్యూలైన్లు, అన్నప్రసాద కేంద్రాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, ఘాట్‌ రోడ్లను పర్యవేక్షించేందుకు ఏఐ కెమెరాలు, డిజిటల్‌ డిస్‌ప్లేలు, స్మార్ట్‌ ట్రాకింగ్‌, సమగ్ర డ్యాష్‌బోర్డులను వినియోగించనున్నారు. ఏఐ కెమెరాల ద్వారా క్యూలైన్లలో భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు దర్శనానికి పట్టే సమయాన్ని డిజిటల్‌ డిస్‌ప్లేలపై తెలియజేసే విధానాన్ని రూపొందించారు. హోల్డింగ్‌ ఏరియాలను బ్లాక్‌లుగా విభజించి రద్దీకి అనుగుణంగా భక్తులను క్రమపద్ధతిలో క్యూలైన్లలోకి అనుమతించేందుకు చర్యలు చేపట్టనున్నారు. చిన్నారులు తప్పిపోయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు క్యూఆర్‌ కోడ్‌ రిస్ట్‌బ్యాండ్లు, ఘాట్‌ రోడ్లపై వాహనాల పాస్‌లను పరిశీలించేందుకు ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు, పార్కింగ్‌ స్థలాల నిర్వహణకు ఏఐ ఆధారిత వ్యవస్థలను రూపొందించారు. లడ్డూ ప్రసాదం పంపిణీలో రద్దీ తగ్గించేందుకు స్మార్ట్‌ వెండింగ్‌ యంత్రాలు, భక్తుల రవాణా కోసం బస్సుల జీపీఎస్‌ ట్రాకింగ్‌, వైద్య సేవల సమన్వయానికి డిజిటల్‌ వ్యవస్థలను కూడా ప్రణాళికలో చేర్చారు. భక్తుల అభిప్రాయాల సేకరణకు క్యూఆర్‌ కోడ్‌, ఐవీఆర్‌ విధానాలు, ఆలయ పరిసరాల పరిశుభ్రత కోసం స్మార్ట్‌ గార్బేజ్‌ అలర్ట్‌ వ్యవస్థను రూపొందించారు. సిబ్బంది, వాలంటీర్ల గుర్తింపు, విధుల పర్యవేక్షణకు క్యూఆర్‌ కోడ్‌ ఐడీ కార్డులను వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అందే సమాచారాన్ని సమగ్ర డ్యాష్‌బోర్డు ద్వారా విశ్లేషించి రద్దీ, వాహనాల కదలికలు, పార్కింగ్‌ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఆధునిక సాంకేతికతను క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తతతో సమన్వయం చేస్తూ భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన అనుభవాన్ని అందించడమే ఈ ఏర్పాట్ల ప్రధాన లక్ష్యం.