కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ పూర్ణకుంభంతో స్వాగతం.. అంతరాలయంలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరించిన విజయ్, అంతరాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఎంపీ కేశినేని శివనాథ్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.