BREAKING
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన రీ సర్వే అభ్యంతరాల పై సమావేశం.... ఎంఈఓ పనితీరుపై ఎంపీడీవో కు యుటిఎఫ్ నాయకులుఫిర్యాదు డి-పట్టా రైతులకు న్యాయం చేయాలి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 24 గంటలు పనిచేయని ఆసుపత్రి ఆర్ఈసీఎస్ లో ఏం జరుగుతుందో? ఆనంద్ బ్రహ్మ అకాడమీ ద్వారా విద్యార్థులు కు ఉచిత శిక్షణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: మడ్డువలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన జిల్లాఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఖరీఫ్ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం* ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు కేంద్ర ఎన్నికల సంఘంపై ‘ఇండియా’ కూటమి తీవ్ర నిరసనలు మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత

గంజాయి నిర్మూలన, నేర నియంత్రణ లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’

Select Suryaa Now
గంజాయి నిర్మూలన, నేర నియంత్రణ లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’

చీపురుపల్లి మేజర్ న్యూస్: 

చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి శంకరరావు, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, బుదరాయవలస ఎస్సైలు, సిబ్బంది సుమారు 35 మంది పోలీసులతో 5 బృందాలుగా ఏర్పడి స్థానిక డైలీ మార్కెట్ వద్ద ఆకస్మిక కార్డన్ అండ్ సెర్చ్ బుధవారం నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా సుమారు 140 ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాల ద్వారా తనిఖీ చేశారు. అలాగే వాహనాల రికార్డులను పరిశీలించి, పత్రాలు సక్రమంగా లేని 15 వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం స్టేషన్ కు తరలించారు. అనుమానితులు పారిపోయే అవకాశం ఉన్న మార్గాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాలను పోలీస్ బృందాలతో దిగ్బంధం చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారా లభ్యం కాలేదని సి ఐ శంకరరావు తెలిపారు. డైలీ మార్కెట్ ప్రాంతంలో సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులతో మాట్లాడి, వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఎవరూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. గ్రామస్థులకు సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించి, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972, డయల్ 100/112, సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని  కోరారు. అనంతరం యువత, ప్రజలతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించి, గంజాయి ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.  గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు–పోలీసులు కలిసి పనిచేసినప్పుడే సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సి ఐ అన్నారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో  చీపురుపల్లి, గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు ఉమా వెంకటేశ్వరరావు,  నారాయణరావు, లోకేష్, లోకేశ్వరావు, సిబ్బంది పాల్గొన్నారు.