BREAKING
బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పినిపే విశ్వరూప్ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. భవిష్యత్తును కాపాడుకోండి.. ఎస్సై లక్ష్మణ్ రావు పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు కే సాద్యం దసరా ఉత్సవాలకు గోడ పత్రికను ఆవిష్కరించనున్న వేణుగోపాల్ రెడ్డి! జిల్లా పోలీస్ శాఖకు రెండు బ్రెత్ అనలైజర్ (డ్రంకెన్ డ్రైవ్ మెషిన్)లను డొనేట్ చేసిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ కెసిఆర్ కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలే.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక... బొడ్డెమ్మ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి డిస్కవర్ అనంతపురానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్...మరో 20 ఏళ్ళ పాటు పెరిగిన జీవితకాలం కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కు 100 కోట్లు కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ బుగ్గారం అంగన్వాడి కేంద్రంలో సిలిండర్ లీకై చెలరేగిన మంటలు

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మానవతా చేయూత

Select Suryaa Now
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మానవతా చేయూత

వీరవల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో నివాసాన్ని పూర్తిగా కోల్పోయిన బాధిత కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గన్నవరం శాఖ అండగా నిలిచింది. సంస్థ ఆధ్వర్యంలో రూ.15 వేల విలువైన ఇంటి సామగ్రితో పాటు దాతలు అందించిన సుమారు రూ.20 వేల విలువైన సామగ్రి, దుస్తులు తదితరాలను కలిపి మొత్తం రూ.35 వేల విలువైన వస్తువులను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి మానవతా గన్నవరం శాఖ చైర్మన్ మడుపల్లి బాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు కర్రా వరప్రసాద్, కోచైర్మన్ వీసం ప్రసాదరావు, గౌరవ డైరెక్టర్ కలపాల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ముక్కామల సుబ్బారావు, యర్కా రెడ్డి, సంజీవరెడ్డి, సభ్యులు నందిగం రవికుమార్, కలపాల రాజబాబు, వీరవల్లి సొసైటీ అధ్యక్షుడు కలపాల నానిబాబు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమ కుటుంబానికి అండగా నిలిచి నిత్యావసర వస్తువులు అందించిన మానవతా సంస్థ ప్రతినిధులకు, దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.