BREAKING
నీటిని పొదుపుగా వాడుకోవాలి : జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు. ఆయుష్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ • జిల్లా ఆయుష్ నోడల్ అధికారి 22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం*

అభ్యర్థి ఎవరైనా గెలిపిస్తాం

Select Suryaa Now
అభ్యర్థి ఎవరైనా గెలిపిస్తాం

• జంగాలపల్లి గ్రామస్తులతో దారపనేని చంద్రశేఖర్ సమీక్ష

పామూరు, మేజర్ న్యూస్ :  మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరిని ప్రతిపాదించినా అందరం కలిసికట్టుగా గెలిపిస్తామని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో శనివారం జంగాలపల్లి గ్రామస్తులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్న మానం మల్లికార్జునరావు, బొడ్డు వెంకటేశ్వరరావు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని దారపనేని చంద్రశేఖర్‌కు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై దారపనేని స్పందిస్తూ ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్ర తీసుకునే నిర్ణయాన్ని అందరం కలిసి ఆచరిద్దామని పిలుపునిచ్చారు. మానం మల్లికార్జునరావు, బొడ్డు వెంకటేశ్వరరావు ఇద్దరూ తమ కుటుంబ సభ్యులేనని ఎమ్మెల్యే ఉగ్ర ఎవరిని ప్రతిపాదించినా విభేదాలకు తావులేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో తూర్పు కోడిగుడ్లపాడు టీడీపీ నేతలు దారపనేని రాజేంద్రప్రసాద్, మిరియం సుబ్బరాయుడు, తిరివీధి చంద్ర, మక్కా నాగరాజు, బొడ్డు రవి, బొడ్డు దానమయ్య, బొడ్డు సుధాకర్, చెనికల మల్లికార్జున, బొడ్డు పెద్దదానమయ్య, బొడ్డు వినోద్, బొడ్డు తిరుపతిరావు, నాగం నాగరాజు, మానం వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.