BREAKING
ఉత్తమ PSHM కు సన్మానము* కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార

ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే

Select Suryaa Now
ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.      

పటాన్ చెరు ; పటాన్ చెరు, జేపీ కాలనీ డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో రూ.19 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వర్షపు నీటి పారుదల కాలువల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో కాలనీల్లో నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట్ల డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శాంతినగర్ కాలనీ ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.19 లక్షల నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లు చెప్పారు.పటాన్ చెరు జేపీ కాలనీ డివిజన్లలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, కాలనీ అధ్యక్షులు అంజిరెడ్డి, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, ఏఈ లావణ్య, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.