BREAKING
ఉత్తమ PSHM కు సన్మానము* కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార

ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్

Select Suryaa Now
ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్

లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు
 

 

రాజ్యసభ ఎన్నికలప్పుడు VPR కోసం టీడీపీ ఎమ్మెల్యేని తెచ్చి కూర్చోబెట్టింది నేను 
 

ఒక్కసారైనా చైనాకు వెళ్లినట్లు నిరూపిస్తే మీ కాళ్ళకు దండం పెడతా
నెల్లూరు, మేజర్ న్యూస్ ప్రతినిధి : - మహిళల గురించి ఇప్పటివరకు నేను అగౌరవంగా మాట్లాడలేదు... ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. ఒకవేళ అది తప్పు అనిపిస్తే, ఆమెకు మా అమ్మ వయసు ఉంటుంది కాబట్టి పెద్దమ్మ అని పిలవడంలో తప్పు లేదనుకుంటా..

- ప్రెస్ మీట్లో మీరు చెప్పిన అబద్ధాలకు సమాధానం చెప్తున్నా... ఇప్పటివరకు పూర్తి ఆధారాలతోనే వేమిరెడ్డీ ప్రభాకర్ రెడ్డి పై మాట్లాడా... లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు. అప్పడు మా పిలక లేడు కాబట్టి అతని గురించి మాట్లాడను..తరువాత అది మూసి వేశారు

 

- ఆ తరువాత ఫిని క్వార్ట్ పెట్టాక మీ అనుచరులే డైరెక్టర్ లుగా ఉన్నారు.. అది కుడా ట్రేడింగ్ కంపెనీ... అందులో  మా పిలక లేడు.. పక్క దేశంలో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని చెప్పా..రమణకుమార్ మీ వాడు కాదా...డవ్ కి VPR లెటర్ ఇచ్చినట్లు చూపించి ప్రశ్నించా అయినా సమాధానం లేదు.

 

- ఆఫీస్ వాళ్లదే అని ఒప్పుకున్నందుకు సంతోషం... ఇవాళ్టికీ అది ఓపెన్ లోనే ఉంది.. అసలు ఫిని అనే ట్రేడింగ్ కంపెనీ ఎందుకు పెట్టారు.. మీ అనుచరుడిపై సిండికేట్ నడిపేందుకే కదా

 

- చిత్తశుద్ధి ఉంటే కంపెనిని ఎప్పుడో మూససి ఉండాలి... కానీ సంవత్సరం సమయం తీసుకున్నారు అయినా ముయలేదు... అవన్నీ చెప్తే మా పెద్దమ్మ నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతోంది... అసలు ఆమెకు సంస్కారం ఉందా

 

• 2014లో అజీజ్ ను మేయర్ చేసే సమయానికి VPR తో మీరు లేరు. అయినా Vpr దగ్గర క్యాంపు పెట్టలేదు... గోవాలోక్యాంపు పెడితే ఇక్కడి టీడీపీ నేతలతో కలిసి జంప్ అవ్వాలనుకున్న వ్యక్తి ఎవరు... ఆరోజు రాత్రంతా లాబీలో కూర్చున్నాం శ్రీధర్ రెడ్డితో కలిసి .. ఎందుకంటే మైనార్టీలకు మా అధినేత ఇచ్చిన హామీని నిలబెట్టాలనేది మా ప్రయత్నం.. అజీజ్ విషయంలో మీ ఆయన చేసింది సున్నా.

- అజీజ్ ఉబ్బందుల్లో ఉండొచ్చు.. ఎవరైనా సాయం చేస్తే గౌరవంగా చెప్తాం...కానీ నిన్న నువ్వు దానంగా ఇచ్చామని చెప్పావ్.. మైనార్టీ సోదరుడికి దానం ఇచ్చాము అని చెప్పడమే కాకుండా అతన్ని బజారున పడేసిన చరిత్ర నీది... ఇదే మీ డబ్బు అహంకారానికి ఉదాహరణ.

 

-  2018లో mp టికెట్ ఇప్పించాలని నన్ను VPR అడిగిన మాట వాస్తవం కాదా... మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని మా వాడికి చెప్పిన మాట వాస్తవం కాదా ... 2019లో నేను డబ్బులు తీసుకున్నానని అన్నారు... అప్పుడు సాయం చేసింది జగన్ గారూ..  మీరు కాదు... కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి పిలిచి నాకు సాయం చేశారు... అది ఆయనకున్న సంస్కారం

 

- రాజ్యసభ ఎన్నికలప్పుడు VPR కోసం టీడీపీ ఎమ్మెల్యేని తెచ్చి కూర్చోబెట్టింది నేను కాదా... నా జీవితంలో వాళ్ళ కాళ్ళకు దండం పెట్టిన సందర్భాలు లేవు.. శివపార్వతులు అని నేను అన్నట్లు ప్రమాణం చేయగలరా..

 

- ఇస్కాన్ సిటీలో గుడి కట్టిన సైట్ మొత్తం మాది.. మా తాత గారూ ఇచ్చింది.  గుడి నిర్మాణానికి బ్యాంకులో నగదు కూడా ఇచ్చాడు మా తాత.. మీ బావ దగ్గర మా తండ్రి కొన్న స్థలమే ఇస్కోన్ లో ఉంది... నా ఆస్తులు నేను అమ్ముకుంటే ప్లాట్లు కబ్జా చేశానన్ని అన్నారు... అంటే వాస్తవాలు మీకు తెలియకుండా మాట్లాడవద్దు.దొంతాలిలో మా కుటుంబానికి ఎప్పటినుంచో పొలాలు ఉన్నాయి...

 

- 2019లో నన్ను గెలిపించానని చెప్పావు... నువ్వు గెస్ట్ గా మీటింగ్ కి వచ్చావ్... అయినా నువ్వు చెప్తే ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారా

 

- 2019లో ఏ రౌండ్ లో కూడా నేను మైనస్ లోకి వెళ్ళలేదు... వాస్తవాలు తెలుసుకో... నేను ఆరోగ్యంగా ఉన్న..  నీ కొడుకు కంటే ఫిట్ గానే ఉన్నా..

 

- ప్రెస్ మీట్లో 70 మందితో కూడిన లిస్ట్ చూపించావ్... మేము ఫైన్ లు వేసిన లిస్ట్ అది. వాళ్ళనుంచి కమిషన్లు దొబ్బేసి అదే లిస్ట్ తెచ్చి చుపించావ్... అందులో బద్రి కూడా ఉన్నాడు అతన్ని అడగండి... అతనికి నాతో సంబంధం ఉంటే దేనికైనా సిద్ధం... తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దు

 

- నాలుగు పాస్పోర్టులు చూపిస్తున్నా... వేతుక్కోండి.. నేను ఒక్కసారైనా చైనాకు వెళ్లినట్లు నిరూపిస్తే మీ కాళ్ళకు దండం పెడతా ..  పచ్చి అబద్ధాలు ఆడుతున్నావ్... అయినా విదేశాలకు వెళ్తే తప్పేముంది. నా స్నేహితుల దగ్గరకు వెళ్ళా

 

- మేయర్ కాకుండా మేయర్ ఫోటో వేసుకున్నారు.. ఇంకా ఆధారాలు బయటికి తీస్తాం.. ఇంకా దొరుకుతారు... మీ చరిత్రలు కట్టలు కట్టలు ఉన్నాయి..  కేసు పేడితే ఆస్తులు జప్తు చేస్తారంట... నేను కోరుకుంటున్నా... ఎంక్వయిరీ చేయించి నా ఆస్తులు మీరె ప్రకటించి భాగ్యం కట్టుకోండి పెద్దమ్మా..

 

- 2029లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేస్తా... వీలుంటే అక్కడ నన్ను మీ నోట్ల కట్టలతో ఒడిస్తారేమో ట్రై చేసుకోండి

 

- అప్పట్లో వేమిరెడ్డీ టచ్ లోనే ఉన్నారని పాదయాత్రలో లోకేష్ స్వయంగా చెప్పారు.. మా బాస్ ఇంకా పాదయాత్ర స్టార్ట్ చేయలేదు... అప్పుడే టచ్ లోకి వెళ్లారంట

 

- మైనార్టీలంటే నేను గౌరవంగా పిలుస్తా..  మీలాగా నోటికి వచ్చినట్లు మాట్లాడను...

 

- శాంతినికేతన్ విల్లా కట్టావ్... 12 మంది నుంచి తీసుకున్న అడ్వాన్స్ ఇంకా ఇవ్వలేదంట..  అందులో మావాళ్లు కూడా కొందరు ఉన్నారు.. త్వరగా ఆ డబ్బులు ఇచ్చేయమ్మా

 

- కోటారెడ్డి గారూ మాకు సాయం చేసిన మాట వాస్తవమే.. కాదు అని నేను చెప్పడం లేదు...

 

- కోటరెడ్డి గారూ గాంధీబొమ్మ వద్ద సైట్ విషయమై కమిషనర్ కి లెటర్ పెట్టిన మాట వాస్తవం.. అప్పుడు ప్రభుత్వ స్థలం ఇప్పుడు రిజిష్టర్ అవ్వగానే మీ స్థలం అవుతుందా

 

- రూప్ వలన చెడ్డపేరు వస్తుందని కొందరు ఆమెకు చెప్పగా..  అందరూ పోయినా పర్లేదు అతనే కావాలని చెప్పిందంట.. వాణ్ణి పక్కన పేడితే మీ కొప్పు రహస్యాలు ఏమీ బయటపడతాయో అనే అనునామాలు టీడీపీలోనే ఉన్నాయి

 

- శ్రీధరన్న చెప్పిన మాట వింటే బాధేసింది... దెయ్యాలకే వేదాలు చెప్పే టాలెంట్ ఉంది శ్రీధర్ అన్నకు..

 

- నేను చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నా...

 

-