తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో మట్టి గణపతి తయారీపై అవగాహన కార్యక్రమం
మట్టి గణపతినే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం.
అమీర్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతి వర్క్షాప్.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో అమీర్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మట్టి గణపతి తయారీపై అవగాహన కార్యక్రమం, వర్క్షాప్ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రవీందర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ నాయుడు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రోత్సహించాలని సూచించారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతో పాటు నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు. పత్రి ఆకుల్లోని సహజ గుణాలు నీటి నాణ్యతను కాపాడటానికి సహాయపడతాయని కార్యక్రమంలో ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
వర్క్షాప్లో విద్యార్థులకు మట్టి గణపతి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించి, పర్యావరణహితమైన గణపతి విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టి గణపతులను తయారు చేశారు.
NCC అధికారి రామునాయక్, TGPCB ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఆర్. రాజేశ్వర్ రావు పిసిబి అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసి నిర్వహించారు
సెప్టెంబర్ 10
సీనియర్ సామాజిక శాస్త్రవేత్త (FAC)
TGPCB, సనత్నగర్