telanagana
బతుకమ్మ ఆడేందుకు అనుమతి ఇవ్వండి - ఉప సర్పంచ్ చుంచు వినయ్
సూర్య, జన్నారం : జన్నారం మండలం ఇంధన్ పల్లి గ్రామంలో గల సర్వేనెంబర్ 105 ప్రభుత్వ భూమిలో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటే అధికారులు కుంటి సాకులతో అడ్డుకుంటున్నారని ఇంధన్ పల్లి ఉప సర్పంచ్ చుంచు వినయ్ కుమార్, వార్డు సభ్యులు మంతుర్తి హనుమండ్లు, ప్రకాష్ మరియు గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆరోపించారు. గతంలో మహిళలు రోడ్డుపైనే బతుకమ్మను ఆడుకునేవారని, మహిళల సంఖ్య పెరగడంతో రోడ్డుపై ఆడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని భావించి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 105 లో ఉన్న ప్రభుత్వ భూమిలో బతుకమ్మను ఆడేందుకు భూమిని చదును చేయగా అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు మహిళల ఇబ్బందులను గుర్తించి బతుకమ్మ ఆడేందుకు ఒక్కరోజైనా అనుమతి ఇవ్వాలని వారు కోరారు.