BREAKING
నగరంలో నీలోఫర్ మూడో స్టోర్ షురూ.. - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేతుల మీదుగా నీలూఫర్ స్టోర్ ప్రారంభం జనసేన సిద్ధాంతాలే మా బలం.. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి సిద్ధం! అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ

అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, రామకృష్ణాపూర్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 2, 3, 18 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 15, 16 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందని, వలస, డబుల్, మృతి చెందిన ఓటర్ల వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం జాబితా నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అర్హత గల ఓటర్ల వివరాలు తొలగించినట్లయితే సంబంధిత వ్యక్తుల నుండి ఫారం 6 ద్వారా దరఖాస్తు స్వీకరించి, వివరాలను పరిశీలించి జాబితాలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని అర్హత గల ఓటర్ల వివరాలు జాబితాలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వలస, డబుల్, మృతి చెందిన వారి వివరాల తొలగింపునకు ఫారం 7 ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలోని దాదాపు 1 లక్ష 70 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా 1 లక్ష 64 వేల మంది నుండి ధ్రువపత్రాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జాబితాలో అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఉండాలని, అనర్హుల వివరాలు ఉండకూడదని తెలిపారు. ప్రత్యేక శిబిరాల తేదీలలో బూత్ స్థాయి అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని, ఓటర్లకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్లయితే సంప్రదించి పరిష్కరించుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, నోటీసులకు సంబంధించి ధృవపత్రాలను అందించవచ్చని తెలిపారు. ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.