'ప్రో గోవిందా లీగ్' ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి
టీ20 ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ముంబై (మహారాష్ట్ర): ముంబైలో ఘనంగా జరుగుతున్న 'ప్రో గోవిందా లీగ్ 2026' పోటీలపై టీ20 ప్రపంచ కప్ విజేత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సంప్రదాయ సంస్కృతికి క్రీడా రూపాన్ని ఇచ్చిన ఈ లీగ్ భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు.
గత రెండు రోజులుగా లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి చూస్తున్న వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయని, స్టేడియంలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయని ఆయన తెలిపారు.క్రీడాకారులు ఎంతో కష్టపడి అద్భుతమైన మానవ పిరమిడ్లు (మనుషుల గోపురాలు) నిర్మించడం చూడటానికి నిజంగా సంతృప్తిని ఇస్తోందన్నారు. ప్రతిభను చాటుకోవడానికి ఈ వేదిక 'గోవిందాల'ందరికీ ఒక మంచి అవకాశమని చెప్పారు.
ఈ క్రీడా లీగ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కూడా గొప్ప మద్దతు లభించడం, క్రీడకు మంచి ప్రచారం దక్కడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.ఈ ఆట కేవలం ఒక పండుగకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా సాగుతూ ప్రజల్లో బలంగా పాతుకుపోవాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయికి ఎదిగి గొప్ప గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.