భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
2036 ఒలింపిక్స్ బిడ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష
అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను హోం మంత్రి 'X' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. 2036లో జరగబోయే ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం భారతదేశం సమర్పించనున్న ప్రతిష్టాత్మక బిడ్ (అభ్యర్థన) సిద్ధం చేసే ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఒలింపిక్స్‌తో పాటు 2029లో జరగనున్న 'పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్', అలాగే 2030 'కామన్వెల్త్ గేమ్స్' నిర్వహణకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై సమీక్ష చేపట్టారు.భారత్‌లో ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, వసతులు పెంపొందించడం ద్వారా దేశాన్ని అంతర్జాతీయ క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు.