టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ మూవీ.. వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై రిలీజ్‌కు ముందే భారీ హైప్ నెలకొంది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది.
టాక్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం యశ్ సత్తా మరోసారి కనిపించినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడంతో తొలిరోజే ఈ మూవీకి భారీ ఓపెనింగ్ లభించినట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డేనే రూ.140 కోట్లకు పైగా?
ట్రేడ్ వర్గాల ప్రకారం ‘టాక్సిక్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇండియాలోనే ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
దేశీయ మార్కెట్‌లో వెర్షన్ వారీగా చూస్తే.. హిందీలో సుమారు రూ.55 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో దాదాపు రూ.16 కోట్లు, కన్నడలో రూ.23.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. తమిళ వెర్షన్ సుమారు రూ.5.5 కోట్లు, మలయాళంలో దాదాపు రూ.1.3 కోట్లు సాధించినట్లు సమాచారం.
మిక్స్‌డ్ టాక్.. అయినా తగ్గని జోరు!
‘KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో యశ్ నటించిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే తొలి షోల నుంచే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ యశ్ క్రేజ్, భారీ అడ్వాన్స్ బుకింగ్స్, సినిమాపై ఉన్న హైప్ కలిసి ఫస్ట్ డే కలెక్షన్లకు బలంగా నిలిచినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఈ చిత్రం మంచి ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించిన స్థాయికి మించి వసూళ్లు నమోదైనట్లు సమాచారం.
అయితే ఇవన్నీ ట్రేడ్ వర్గాలు, వివిధ బాక్సాఫీస్ రిపోర్టుల ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమే. తొలిరోజు వసూళ్లపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.